నిమ్మనపల్లి మండల యువకుడు బెంగుళూరులో స్నేహితుని చేతిలో హత్యకు గురయ్యాడని గురువారం పవన్ హళ్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సెల్వం తెలిపారు. గుండ్లబురుజు దళిత వాడకు చెందిన బాలాజీ(24) పవన్ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డనహళ్లి లో ఉండే రామచంద్రపురం కు చెందిన స్నేహితుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఈ కారణంగా పగ పెంచుకున్న స్నేహితుడే బాలాజీ ని హత్య చేశాడని ఆయన తెలిపారు.