కుటుంబ సమస్యలతో వ్యక్తి విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని మదనపల్లి తాలూకా సీఐ వెంకటరమణ తెలిపారు. మిట్టపల్లికి చెందిన నారాయణ (55) సీటీఎంలో షామియానా సప్లై చేస్తుంటారు. శుక్రవారం కుటుంబ సమస్యలతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటరమణ తెలిపారు.