కంభం: బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్
ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట మండలాలలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 38 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేశామని మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కొండారెడ్డి ప్రజలను హెచ్చరించారు.