గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో జిల్లాలో చిట్ట చివరగా ఉండే తన నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. తన హయాంలో 100 పడకలుగా అప్ గ్రేడ్ చేసిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం 40 పడకలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు కొమరోలు ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు.