అర్ధవీడు: మద్యం బెల్టు షాపు కొరకు బహిరంగ వేలంపాట
అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో మద్యం బెల్టు షాపు కొరకు బహిరంగంగా వేలం పాట నిర్వహించిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి గ్రామంలోని ఓ గుడిలో వేలం పాట నిర్వహించగా రూ.7 లక్షలకు ఓ వ్యక్తి మద్యం బెల్టు షాపు దక్కించుకున్నాడు. ఎమ్మార్పీ కన్నా రూ. 30 నుంచి రూ. 50 వరకు అమ్ముకోవచ్చని గ్రామంలో మరెవరు మద్యం అమ్మరాదని అధికార పార్టీకి చెందిన నాయకుల సమక్షంలో గ్రామస్తులు తీర్మానించారు.