కంభం పట్టణంలో సోమవారం స్థానిక ఎస్సై నరసింహారావు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై కేసులు నమోదు చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మొత్తం 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా ఎస్సై తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కోర్టులో ప్రవేశపెడతామని అనంతరం కోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు.