ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చింతలపాలెం జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణాన్ని ఈనెల 7వ తేదీన బిజెపి నాయకులు అడ్డుకున్నారు. తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు గోవులను గోశాలలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఎస్సై రవీంద్రారెడ్డి గోవులను ఓ కంటైనర్ లో పల్నాడు జిల్లాలోని గోశాలలకు తరలించారు.