చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాలోని ఓ టెక్ కంపెనీ తమ ఉద్యోగులు డేటింగ్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కంపెనీలోని సింగిల్స్ బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా పోస్ట్‌లు పెడితే 66 యువాన్లు (రూ.770) ఇస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో 3 నెలల పాటు డేటింగ్ చేస్తే వెయ్యి యువాన్లు (రూ.11,650) రివార్డును అందిస్తారు.