హైదరాబాద్ మియాపూర్‌లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న ఉదయం బాలికను నిందితుడు చింటూ (విఘ్నేశ్) తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన ఫ్రెండ్, అతని భార్య బయటికెళ్లడంతో మధ్యాహ్నమే ఆమెను చంపేశాడు. ఆపై మీ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. పదే పదే పలువురికి వాట్సాప్ కాల్ చేసినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.