గిద్దలూరు: రసాభాసగా కౌన్సిలర్ల సమావేశం

63பார்த்தது
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా మారింది. కార్యాలయంలో పనిచేస్తున్న 11మంది కార్మికులను తొలగించడంపై వైసిపి కౌన్సిలర్లు చైర్మన్ ను ప్రశ్నించారు. వారు స్వచ్ఛందంగా విధులనుంచి తప్పుకున్నారని చైర్మన్ సమాధానం ఇవ్వడంతో సభలో గందరగోళం నెలకొంది. వైసిపి, టిడిపి కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది.

தொடர்புடைய செய்தி