ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేయాలని సీపీఐ నాయకులు పిడుగు మస్తాన్ డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలసపాడు మండలం చింతలపల్లి గ్రామం నుంచి కొమరోలు రహదారిని శుక్రవారం పరిశీలించారు. ఈ మార్గ మధ్యలో అనేక గుంతలు ఉన్నాయని ఆర్ అండ్ బి అధికారులు స్పందించి వెంటనే గుంతలు పూడ్చివేయాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే అధికంగా ప్రమాదాలు జరుగుతాయని వారు తెలిపారు.