అనంతపురం జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ముని స్వామి ఆదేశాలతో మంగళవారం అక్రమ మద్యంపై దాడులు చేశారు. ఉరవకొండ మండలం కోనాపురం, నెరిమెట్ల గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 71 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అనంతపురం ఎక్సైజ్ ఏసీ సుహాసిని, సీఐ రవిచంద్ర, ఎస్ఐ లు పోతులయ్య, నరేశ్ పాల్గొన్నారు.