ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు జీవో నెంబర్ 1, 41 నిబంధనలను పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు అందించకపోతున్నాయని ఆరోపించారు. అర్హతలేని ఫ్యాకల్టీతో విద్యను అందించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.