ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి శనివారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణరెడ్డి పత్తిలో చీడ పురుగుల నివారణ కోసం తెచ్చిన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.