తాడిపత్రి మున్సిపాలిటీలో ఉన్న కోడి, పొటేలు మాంసం విక్రయదుకాణాల వద్ద ఎటువంటి చెత్త కనిపించినా షట్టర్ వేస్తామని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆయా దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి తరువాత ప్రతి దుకాణాన్ని పరిశీలిస్తామని, అప్పుడు అపరిశుభ్రంగా ఉందని గుర్తిస్తే చర్యలు తప్పవన్నారు.