నార్పల మండల పరిధిలోని కేసేపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఆధార్ స్పెషల్ డ్రైవ్ ను మంగళవారం ఎంపీడీవో గంగావతి, ఈఓఆర్డీ శైలజ రాణి, పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవితో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ మండల ప్రజలు ఎవరైనా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తగిన ఆధారాలతో సరిచేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలకు వినియోగించు కోవాలన్నారు.