నిర్ణీత గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం

1095பார்த்தது
నిర్ణీత గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం
శ్రీ సత్య సాయి జిల్లాలో నిర్ణీత గడువులోగా మొదటి దశ రీ సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. గురువారం రీ సర్వే ప్రక్రియ, గృహ నిర్మాణాల పురోగతిపై జాతీయ రహదారులకు భూ సేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రీ సర్వే, జాతీయ రహదారులకు భూ సేకరణ గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. పర్యాటక శాఖ కు చెందిన భూమి అలియనేషన్ త్వరగతిన పూర్తి చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై జగనన్న భూ హక్కు భూ రక్ష రీసర్వేలు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

మొదటి దశలో రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్లు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలలోపు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణం పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాతీయ రహదారులకు భూ సేకరణ త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డి ఆర్ ఓ కొండయ్య, గృహ నిర్మాణ పీడీ చంద్రమౌళి రెడ్డి, సిపిఓ విజయ్ కుమార్, ల్యాండ్స్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, డి ఆర్ డి ఏ పిడి నరసయ్య, పి ఆర్ ఎస్ ఈ గోపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி