అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు సచివాలయాల్లో నేడు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఎనుముల పల్లి డాక్టర్ డాక్టర్ నాగరాజ్ నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సచివాలయాలకి వచ్చే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. కరోనా ఇంకా తొలగిపో లేదని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సూచించారు.