సోమందేపల్లి మండలం మాగేచెర్వు పంచాయతీ చెన్నాపురం గ్రామంలో శుక్రవారం గ్రామసభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రీ సర్వేలో భూ సమస్యల పరిస్కారం కార్యక్రమంనకు సర్పంచ్ బి. నరసింహులు హాజరై చెన్నాపురం పొలం సమస్యలు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామ రెవిన్యూ అధికారులు, సర్వేయర్ లు, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.