పెనుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా పోలీస్ లతో ఎస్ ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, మహిళల భద్రత, రోడ్డు భద్రత, పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర వాటిని నివారించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలిపారు. ప్రతి ఊరిలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించవలసిందిగా తెలిపారు.