కదిరి ఆర్టిసి బస్టాండ్ ప్రాంగణములో ఆదివారం ఒక గుర్తు తెలియని మహిళ తన 5నెలల చిన్న పాపను మరో మహిళకు ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తాను అని చెప్పి తిరిగి రాలేదు. పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం రాగా పోలీసులు అక్కడికి చేరుకొని మహిళను గురించి విచారించగా ఆమె ఆచూకి తెలియలేదు. చిన్న పాపను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్ళి సదరు మహిళ మీద సుమోటో కేసు నమోదు చేసి పాపను ఐసీడిఎస్ వారికి అప్పగించారు.