శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మండల పరిధిలోని కమ్మలవాండ్ల పల్లి సమీపంలో రాయచోటి ప్రధాన రహదారిలో సీఐ మోహన్ మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడంతో పాటు వాహనాలు వేగంగా నడపరాదని, హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనాలు నడపాలని సూచించారు. ీ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.