శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డివిజన్ లో దసరా నవరాత్రులను పురస్కరించుకొని విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని డీఎస్పీ మహేశ్ గురువారం తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా విగ్రహాలు ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజల శాంతిభద్రతల కోసం అందరూ సహకరించాలని కోరారు.