గుత్తి మండలంలోని మారేపల్లి గ్రామంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతుల నుంచి తహసీల్దార్ ఓబులేసు వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రీ సర్వేలో వచ్చిన భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి అర్జీల రూపంలో ఇవ్వాలని కోరారు. గ్రామాలలో భూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు.