గుత్తి పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఎస్ఐ ఆశా బేగం ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆసుపత్రి ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్, రాయల్ సర్కిల్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని పలువురికి జరిమానా విధించారు.