తమ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని గుత్తి మాజీ సైనికు ఉద్యోగుల సంఘం నాయకులు సోమవారం గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు ఇంటి స్థలాలతోపాటు పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారు. మాజీ సైనిక ఉద్యోగులు కృష్ణయ్య, కృష్ణారావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.