గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వాసవి మాతకు ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవ శర్మ మహిషాసుర మర్దిని అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.