వైద్య ఆరోగ్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ధర్మవరం రైల్వే స్టేషన్ లో దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉచితంగా ఇచ్చారు. గతంలో రైల్వే స్టేషన్ ను సందర్శించినప్పుడు దివ్యాంగుల కోసం ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇస్తానని మంత్రి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఎలక్ట్రిక్ వాహనాన్ని టీడీపీ జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు నాగూర్ స్టాలిన్‌తో కలిసి ప్రారంభించారు.