భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న ధర్మవరం చెరువు

72பார்த்தது
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురవడంతో ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మంగళవారం ధర్మవరం చెరువు పొంగిపొర్లుతోంది. ధర్మవరం పట్టణవాసులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకుని తిలకిస్తున్నారు. చెరువు అందాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు. చెరువు వద్ద ప్రమాద ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி