కేంద్ర రైల్వే మంత్రికి ధన్యవాదాలు

75பார்த்தது
కేంద్ర రైల్వే మంత్రికి ధన్యవాదాలు
గత పార్లమెంట్ సమావేశంలో జిల్లా ప్రాంత వాసుల చిరకాల కోరిక అయినటువంటి బెంగళూరుకు రైలు సౌకర్యం కలిపించవలసిందిగా కేంద్ర రైల్వే మంత్రికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే మంత్రి స్పందించి రైలును అనంతపురంకు పొడిగించినందుకు ఎంపీ సర్వదా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లగా అనంతపురం ప్రజలు ఎదురుచూస్తున్న పుట్టపర్తి - బెంగళూరు ప్యాసింజర్ రైలు నెంబర్ 06515/06516ను అనంతపురం వరకు పొడిగించినందుకు రైల్వే మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி