అనంతపురం నగరంలో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ధర్నా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని 2100 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు 1400 కోట్లు వసతి దీవెన తక్షణమే విడుదల చేయాలని కోరారు. 9.5 లక్షల మంది విద్యార్థులకు గత సంవత్సరం కేవలం ఒక క్వార్టర్ మాత్రమే విడుదల కాగా, మిగతా మూడు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.