ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. అనంతపురం సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుల్లాయి మాట్లాడుతూ. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని, జీఓ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.