అనంతపురం జిల్లాలో అక్టోబర్ 31న ఏ ఐ టి యూ సి 105 వ ఆవిర్భవ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రాజేశ్ గౌడ్ అధ్యక్షత వహించారు. అన్ని రంగాల కార్మికులు విరివిగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు.