అనంతపురం నియోజకవర్గ పరిధిలోని ఏడుగురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందజేశారు. గురువారం రూ. 11. 70 లక్షల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. నాలుగు నెలల్లో నియోజకవర్గంలోని పలువురికి రూ. 35 లక్షలు అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.