తుంగభద్ర జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద

74பார்த்தது
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి మంగళవారం 20, 929 క్యూసెక్కుల నీరు చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 87. 70 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. వివిధ కాల్వలకు 10, 098 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி