కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దామని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఏపీ ఎన్జీవో భవనంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజి ఆధ్వర్యంలో నిర్మాణ మహాసభలపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 19, 20వ తేదీలలో కళ్యాణదుర్గంలో జరగనున్న నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.