ఎలమంచిలి పట్టణంలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛతా హీ ర్యాలీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.