ఈ క్రాప్ పూర్తి చేసుకున్న రైతులంతా ఈకేవైసీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు తెలిపారు. సబ్బవరం మండలం అమృతపురం గ్రామం రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం జరిగిన రైతుల జాబితాలను సిద్ధం చేసి గ్రామ మండల కమిటీలతో ఆమోదం పొందిన వెంటనే జిల్లా కేంద్రానికి పంపించాలన్నారు.