మాడుగుల మండలం సాగరం, ఎం కోడూరు గ్రామాలలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎం వాసుదేవరావు ఆధ్వర్యంలో వరి పొలాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో తో కలిసి కెవికె శాస్త్రవేత్త సౌజన్య, మాట్లాడుతూ వరి పంట ప్రస్తుతం చిరు పొట్ట దసకు చేరుతున్నందున, ఈ దశలో ఎకరాకి 25కిలోల యూరియా, 15 నుంచి 20 కిలోల పొటాష్ తప్పని సరిగా వేయాలన్నారు.