శ్రీ గణేశ గాయిత్రి బ్రాహ్మణ సేవా ట్రస్ట్ సౌజన్యంతో, విశాఖ శంకర్ ఫౌండేషన్ వారిచే బుధవారం చోడవరంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరం లో మొత్తం 135మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో45మందికి శస్త్ర చికిత్స నిమిత్తం విశాఖ శంకర్ ఫౌండర్ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్యులు డాక్టర్ మూడు శ్రీనిజ, సిబ్బంది పాల్గొని రోగులను పరీక్షించారు.