ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. మంగళవారం రాంబిల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రమాదాలు సంబంధించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. మత్స్యకారులతో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.