మహాత్మా గాంధీజీ అనుసరించిన అహింస మార్గాన్ని అందరూ ఆచరించాలని ఎలమంచిలి ఎంపీపీ గోవింద్ అన్నారు. బుధవారం ఎలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఆయుధాలు కంటే అహింస అనే ఆయుధాన్ని పట్టుకొని బ్రిటిష్ వారిని భారతదేశంలో నుంచి వెళ్లగొట్టారన్నారు. అహింస మార్గం ఎంచుకున్న వారికి శత్రువులు ఉండరని తెలిపారు.