ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రామానాయుడుపాలెం వంతెన, ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, అండర్ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.