తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని భావిస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు పప్పల చలపతిరావు అన్నారు. ఆదివారం యలమంచిలి టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ నాణ్యతను పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్ కు అప్పగించాలన్నారు. గత ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయట పెడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.