ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటమే శరణ్యమని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్. అంబేద్కర్ అన్నారు. ఆరిలోవ తోటగరువు ఉన్నత పాఠశాలలో చినగదిలి యుటిఎఫ్ మండల శాఖ 50వ స్వర్ణోత్సవ మహాసభ జిల్లా అధ్యక్షులు నేతల ప్రభాకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్. అంబేద్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల హక్కుక కోసం రాజీ లేని పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు.