విశాఖ జోన్ -4 కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఎంపీ శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తులు నిర్వహించే వారికి చేయూతనిచ్చి , ప్రోత్సాహం అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.