ఎన్డీయేకి మద్దతు ఉపసంహరణ చేసుకుంటాం అని చంద్రబాబు ఒక మాట చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన నేతలు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని హామీలు గుప్పించి అధికారంలో వచ్చాక కేంద్రంలో బీజేపీకి ఎదురు చెప్పకుండా వత్తాసు పలకడం ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.