విశాఖ నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట 200 మంది మహిళల సోమవారం ఆందోళన నిర్వహించారు. నూతన వంతెన నిర్మాణం కోసం ఇటీవల మూసివేసిన పోర్ట్ రహదారికి ప్రత్నామాయంగా ఎస్స్‌బి సి నుంచి రాకపోకలకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ భర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కావాలని డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు ఆందోళనకు దిగారు.