గంగవరం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ను జనసేన నాయకులు కలిశారు. శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరికీ అందుబాటులో ఉండి, పోలీసులు తగిన సహాయాలను అందిస్తామని ఎస్సై తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉపాధ్యక్షులు గవారాజు, వెంకన్న దొర, రాజు, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.