ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లను కోటవురట్ల ఎస్సై రమేశ్ హెచ్చరించారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. లైసెన్స్ లేకుండా ఆటో నడపవద్దని సూచించారు. అన్ని రికార్డులు డ్రైవర్ల వద్ద ఉండాలన్నారు. పరిమిత వేగంతో నడపాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దన్నారు. అలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.